హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనాపై పోరులో వైద్యుల కృషి మరువలేనిదని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రోగులకు వారు అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. ఫీవర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న పదకొండు మంది వైద్యులకు ఈ మేరకు ఆమె లేఖలు రాశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇద్దరు ఆర్ఎంఓలు, మరో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైరాలజీ విభాగపు ఇద్దరు వైద్యులను గవర్నర్ అభినందించారు. మీ సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆమె ఆ లేఖల్లో పేర్కొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]