[spt-posts-ticker]

మెరుగైన సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ

   నిర్మల్,(ఆరోగ్యజ్యోతి)  ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.బుధవారం సారంగాపూర్, దిలవార్ పూర్, ముజ్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి, వైద్య అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సారంగాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను పరిశీలించిన అనంతరం ధరణి పాస్ బుక్ ప్రతులను రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డాక్టర్లు, వైద్య ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు శాతాన్ని పరిశీలించి, సమయపాలన పాటించాలని సూచించారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రి లో పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, తాసిల్దార్ తుకారాం, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీమ్,  డాక్టర్ కార్తీక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *