[spt-posts-ticker]

మేడారంలో 50 పడకల ఆసుపత్రి

జాతర రోజుల్లో అందుబాటులో వైద్యనిపుణులు,
పారామెడికల్‌ సిబ్బంది సేవలు
ఆరోగ్యశాఖ సమగ్ర ప్రణాళిక

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకూ జాతర జరగనున్న రోజుల్లో మేడారంలో 50 పడకలతో ప్రత్యేక ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దానికి సమ్మక్క సారలమ్మ వైద్యశాలగా నామకరణం చేస్తారు. వైద్యసేవల్లో పాల్గొనేందుకు 120 మంది వైద్యులు, 30 మంది మహిళా వైద్యులు, 530 మంది పారామెడికల్‌ సిబ్బందిని ఇక్కడ నియమించనుంది. మేడారం జాతరలో వైద్యపరమైన ఏర్పాట్లపై ఇటీవల ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి, సమగ్ర ప్రణాళికను వివరించారు.

ముఖ్యాంశాలు..
* మొత్తం జాతరలో వైద్యఆరోగ్య శాఖకు సంబంధించి క్యాంపు అధికారులుగా ములుగు జిల్లా వైద్యాధికారి, ఏటూరునాగారం జిల్లా ఉప వైద్యాధికారి బాధ్యులుగా వ్యవహరిస్తారు.
* పర్యవేక్షణాధికారులుగా మహబూబాబాద్‌, వరంగల్‌ పట్టణ, వరంగల్‌ గ్రామీణ, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాల నుంచి 8 మంది ఉప వైద్యాధికారులను నియమిస్తారు.
* వరంగల్‌లోని ఎంజీఎం, సీకేఎం, ప్రాంతీయ కంటి ఆసుపత్రి సహా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇతర తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్పెషలిస్టు వైద్యులను సేవల్లో ఉపయోగిస్తారు.
* 60 మంది నాలుగో తరగతి సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు.
* 10 అత్యవసర వైద్యసేవల వాహనాలు(108), నాలుగు సంచార వైద్యసేవల వాహనాలు(104) సిద్ధం చేస్తారు.
* వీటికి అదనంగా ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల నుంచి 10 రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ వాహనాలను, 8 ప్రైవేటు అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతారు.
* కొన్ని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు స్వచ్ఛందంగా 10 పడకలతో కూడిన స్పెషలిస్టు వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నాయి.
* ములుగు, ఏటూరునాగారం, పరకాల, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పస్రా పీహెచ్‌సీల్లోనూ వైద్యసేవలను అందుబాటులో ఉంచుతారు.
* జాతరకు వెళ్లే 8 రహదారుల వెంట 40 ప్రథమ చికిత్స కేంద్రాలను నెలకొల్పుతారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *