మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజులోనే 221 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1982 చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక తర్వాతి స్థానంలో ఢిల్లీ, తమిళనాడు ఉన్నాయి. ఢిల్లీలో ఆదివారం 85 మంది కరోనా సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 1154కు చేరింది.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]