[spt-posts-ticker]

యోగము అంటే ఏమిటి

యోగము అంటే ఏమిటి?

“యుజ్” అనగా “కలయిక” అనే సంస్కృత ధాతువు నుండి “యోగ” లేదా “యోగము” అనే పదం ఉత్పన్నమైంది. “యుజ్యతేఏతదితి యోగః”, “యుజ్యతే అనేన ఇతి యోగః” వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము – యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుని యందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు

“యోగము” అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.

భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో “యోగ” లేదా “యోగ దర్శనము” ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం “యోగం అంటే చిత్త వృత్తి నిరోధం”. స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను “పతంజలి అష్టాంగ యోగం’ అంటారు. దీనినే రాజయోగం అంటారు

పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.

 1. సమాధిపదఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి పరమానంద స్థితిని సాధించడము దీనిలో వివరించబడింది.
 2. సాధనపదకర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడింది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
 3. విభూతియోగముజాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడింది.
 4. కైవల్యపదమోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.

సంప్రదాయంలో యోగా

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడింది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. 11 వ శతాబ్డము న ఘూరఖ్స్ నాద్ శిశ్యుడగు స్వామి స్వాత్వారామ ముని హఠ్ యొగము అను యొగ శాస్త్ర గ్రంథమును వ్రాసి యున్నారు. ఇందు ఆసనములను, ప్రాణాయామ పద్ధతులను, బంధములను, ముద్ద్రలను, క్రియలను సవిస్తారముగ వ్రాసి యున్నారు. అనేక వేల ఆసనములలో 84 ఆసనములను ముఖ్యములుగ చెప్పబడెనవి. ముఖ్యముగ ధ్యానమునకు కావలసిన సుఖాసనము, సిద్దాసనము, అర్ధ పద్మాసనము, పద్మాసనములు ముఖ్యమని చెప్ప బడింది. ఇదె విధముగ పాతంజలి యొగ శాస్త్రమున – స్థిరసుఖ మాసనమ్- అని ఆసనము నకు నిర్వచనము ఉంది. ప్రాణాయామ సాధనలో – సూర్య భేదన, ఉజ్జాయి, శీతలి, సీత్కారి, భస్త్రిక, భ్రామరి, ప్లావని, మూర్చ – ఇతి అష్ట కుంభకాని ( 8 ప్రాణాయమములు) చెప్ప బడెను. జాలంధర బంధము, మూల బంధము, ఉడ్యాన బంధము – ఈ మూడు బంధములు ముఖ్యమని చెప్పబడెను. ముద్రలలో మహాముద్ర, మహాబంధ, మహాభేధ – ముఖ్య మగు ముద్రలుగ చెప్ప బడెను. శరీరమునకు బహిర్ అంతర్ శుచి చాల అవసరముగ ఈ హథయొగమున ప్రధాన అంశముగ చెప్పబడింది.-ధవుతి, నేతి, వస్తి, నొలి, త్రటకం, తధా కఫాల భాతి ఏతాని షట్ కర్మాణి – అని వివరణగలదు..

భగవద్గీతలో యోగములు

భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి “యోగము” అనే పేరు ఉంది. ఇక్కడ “యోగం” అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.

 • అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు, మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.
 • సాంఖ్య యోగము:- ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.

 

 • కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు, దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.

 

 • జ్ఞాన యోగము:- నర, నారాయణూల జన్మలు, భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.

 

 • కర్మసన్యాస యోగము:- కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.

 

 • ఆత్మసంయమ యోగము:- ధ్యానము, ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు, సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన, భగవంతుని సర్వవ్యాఇత్వము, యోగభ్రష్టత ఫలితాల వర్ణన.

 

 

 • అక్షరపరబ్రహ్మ యోగము:- బ్రహ్మతత్వము, ఆధ్యాతకత, కర్మతత్వము, ఆది దైవతము, ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు, జీవ ఆవిర్భావము, అంతము, పుణ్యలోక ప్రాప్తి, అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.

 

 

 • విభూతి యోగము:-భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.

 

 

 • భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.

 

 

 

 

 

 

వ్యాప్తి ఆదరణ ప్రయోజనము

ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో నిబిడీకృతంగా ఉన్నఆద్ధ్యాత్మిక భావం కారణంగా దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. ముఖ్యముగా పాశ్చాత్యదేశాల యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. పాశ్చాత్య దేశీయులకు యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. బుద్ధ ఆరామలాలో ఇచ్చేశిక్షణలో యోగా కూడా ఒక భాగమే. వారి వేషధారణ క్రమశిక్షణ ప్రపంచ ప్రాముఖ్యత ఆకర్షణ సంతరించుకున్నది. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన మానసిక ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని పలువురి విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా అధునిక కాలంలో కూడా అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది.

 

 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *