ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితం, ఒత్తిడీ ఇవ్వని డిప్రెషన్‌కు కారణాలే. దీని లక్షణాలు వారు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలను బట్టి మారుతుంటాయి. ఒత్తిడిని తగ్గించి మనం ప్రతి రోజు ఉత్సాహంగా ఉండేలా చేసేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతోంది. డిప్రేషన్ నుంచి బయటపడేందుకు ప్రత్యేక యోగాసనాలు కూడా ఉన్నాయి. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ యోగాసనాల గురించి తెలుసుకుందాం.
- బాలాసనం : ఈ ఆసనం మనలోని ఒత్తిడిని, ఆందోళనని తగ్గిస్తుంది. మనలో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది.
- హలాసనం : ఒత్తిడి, అలసటని తగ్గిస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ని ఉత్సాహపరిచి మనలో ఎనర్జీని పెంచుతోంది.
- శవాసనం : గాఢమైన విశ్రాంతినిస్తుంది, వాత దోషాన్ని తగ్గిస్తోంది. మనసు, శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.
- సేతుబంధాసనం : ఆలోచనలు తగ్గించి మనసును ప్రాశాంతంగా ఉంచుతోంది. ఊపితిత్తులకు బాలానిస్తుంది. థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది.
- నాడి శోధన ప్రాణాయామం : బాధ, ఆందోళన లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతోంది. నాడులను శుద్ధి చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి డిప్రెషన్‌ను పోగొడుతుంది.
వీటితో పాటు ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆరోగ్యకరమైనా ఆహారం తీసుకోవడం వంటివి కూడా చేస్తే డిప్రెషన్ నుంచి బయటపడి ఉత్సాహంగా ఉంటాం. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకొని ఆసనాలు వేయాలి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]