భైంసా: నిత్యం క్రమం తప్పకుండా యోగా సాధన చే స్తే పరిపూర్ణఆరోగ్యం సిద్ధిస్తుందని పతాంజలి యోగా సంస్థ తెలంగా ణ రాష్ట్ర అధ్యక్షురాలు మథుశ్రీ పే ర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పూలేనగర్ సుభద్రవాటిక శ్రీ సర స్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశా లలో జరిగే యోగా క్యాంప్ ముగి ంపు కార్యక్రమంలో పాల్గొని మా ట్లాడారు. వాతావరణ పరిస్థితి తీ సుకుంటున్న విషతుల్య ఆహారం తోపాటు శారీరక శ్రమలేకుండా పోతుండటంతో వ్యాధుల బెడద అధికమవుతోందన్నారు.
రోగాల బారిన పడి ఆసుపత్రులలో చేరు తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో వ్యాధుల బారిన పడకుండా ఉండే ందుకు, వ్యాధుల తీవ్రత తగ్గించు కునేందుకు గాను యోగా సాధన ఎంతో అవసరమన్నారు. దినమం తా విధులు, వ్యాపారాలు, చదువు, ఇంటి పనులు తదితర వాటితో బి జీబిజీగా కాలం గడుపుతున్న వార ందరూ నిత్యం ఉదయం వేళలో గంట పాటు యోగా సాధన చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అ న్నారు. వివిధ ఆసనాల ద్వారా శ రీరానికి కలిగే ప్రయోజనాలను వి వరించారు. యోగా శిబిరం ము గింపును పురస్కరించుకొని పాఠ శాల అవరణలో యజ్ఞం నిర్వహిం చారు. అనంతరం యోగా గురువు లను అబ్యాసకులు సన్మానించి జ్ఞా పికలు బహూకరించారు. ఇందులో పాఠశాల ప్రబంధకారిని అధ్యక్షు డు రమేష్ మహాశెట్టివార్, కోశాధి కారి శ్యామ్ మందాని, ప్రదానోపా ధ్యాయులు దేవేందర్, యోగా సా ధకులు అధికసంఖ్యలో ఉన్నారు.