అధిక రక్తపోటుకు
మొదట పద్మాసనంలో కూర్చోవాలి. చిత్రంలో చూపిన విధంగా రెండు చేతుల మధ్యవేళ్లను లోపలికి మడవాలి. చిటికెనవేలు, చూపుడు వేలు, బొటనవేలు నిటారుగా ఉంచాలి. కళ్లు మూసుకుని చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. ఇలా అయిదు నుంచి పది నిమిషాల వరకు చేయాలి.
అపాన వాయు ముద్ర
చూపుడు వేలిని మడిచి బొటనవేలు మొదట్లో ఉంచాలి. మధ్యవేలు, ఉంగరంవేలు చివర్లు బొటనవేలి చివరితో కలపాలి. చిటికెన వేలు నిటారుగా పెట్టాలి. ఇలా రెండు చేతులతో చేస్తూ… వాటిని మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అయిదు నుంచి పది నిమిషాల వరకు చేయొచ్చు. బీపీ ఎక్కువగా ఉంటే ముద్రలు కూడా ఎక్కువసార్లు చేయాలి.
శశాంకాసనంముందుగా రెండు కాళ్లను వెనక్కి మడిచి వజ్రాసనంలో కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి తీసుకురావాలి. శ్వాస వదులుతూ నిదానంగా నుదురును నేలకు తాకించాలి. చేతులను కూడా నేలపై ఉంచాలి. పూర్తిగా కిందకు వంగలేనివారు దిండుపై తలను పెట్టి ప్రయత్నించొచ్చు.
– అరుణ, యోగా నిపుణురాలు
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]