[spt-posts-ticker]

రక్తహీనతతో గిరిజన బాలిక మృతి

సిరికొండ: ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పోచంపల్లి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యం, రక్తహీనతతో బాధపడుతున్న గిరిజన బాలిక ఆదివారం మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మడావి సంగీత (15) కొంతకాలంగా రక్తహీనత, జాండీస్‌ వ్యాధితో బాధపడుతుం దని ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్సలు జరిపినా నయం కాలేదని, శనివారం సా యంత్రం పరిస్థితి మరింత విషమించడంతో ఇచ్చోడలో ఓ ప్రైవేటు ఆసుప త్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా మార్గమ ధ్యలో మండలంలోని జాకిర్‌గూడ గ్రామసమీపంలో కుటుంబ సభ్యులు అం దరితో వాహనంలో మాట్లాడుతూనే అకస్మాత్తుగా మృతిచెందినట్లు కుటుం బీకులు, గ్రామస్థులు తెలిపారు.సంగీత మృతదేహానికి ఆదివారం వారి సొ ంత గ్రామమైన పోచంపల్లిలో కులఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వ హించినట్లు గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపారు. బాలిక సంగీత మృ తితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంగీత అంత్యక్రియల కు సిరికొండ మండల అధ్యక్షుడు పెందూర్‌ అమృత్‌రావు, మండల జడ్పీటీ సీ సభ్యురాలు కుమ్ర చంద్రకళ, పోచంపల్లి, ఖన్నాపూర్‌ సర్పంచ్‌లు లక్ష్మీ, ర ఘురాం తదితరలు హాజరై కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *