అన్నవరం, తెనాలి, (ఆరోగ్యజ్యోతి) : రాజయోగ అభ్యాసంతో సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పొందవచ్చునని రాజయోగి (మౌంట్ అబూ) ప్రభాకర్ భాయి పేర్కొన్నారు. అన్నవరంలోని సత్యదేవుని దేవస్థానంలోగల సీతారామసత్రం ఆవరణలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో సంపూర్ణ అవ్యక్త ఫరిస్తా స్వరూప భట్టీ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈనెల 24 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మకుమారీలు, స్వామీజీలు, ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయోగి అమిత్ భాయి, హైదరాబాద్ బ్రహ్మ తేజస్సు పీఠం శంకరాచార్య స్వామీజీలు మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, నిరంతర భయం, నిద్రలేమితనం తదితరవాటికి రాజయోగ శిక్షణే శాశ్వత పరిష్కారమని తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సంస్థ సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం అన్నపూర్ణ దీదీ, జిల్లా ఇన్ఛార్జి రజనీ దీదీ తదితరులు పాల్గొన్నారు.