[spt-posts-ticker]

రాష్ట్రంలో రెడ్‌జోన్‌ జిల్లాలు

  • దేశవ్యాప్తంగా 170 రెడ్‌జోన్‌ జిల్లాలు గుర్తింపు
  • రాష్ర్టాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరింత పకడ్బందీగా కట్టడి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లుగా ప్రకటించింది. తెలంగాణలో 8 జిల్లాలు.. హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, కరీంనగర్‌, నిర్మల్‌ను నిర్ధారించింది.

రెడ్‌జోన్‌ హాట్‌స్పాట్‌ క్లస్టర్‌ జిల్లాగా నల్లగొండను నిర్ణయించింది. ఆరెంజ్‌ జోన్‌ (నాన్‌ హాట్‌స్పాట్‌) జిల్లాలుగా సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేటను కేంద్రం నిర్ధారించింది. మిగిలిన జిల్లాలు గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుధన్‌.. రాష్ర్టాలకు లేఖ రాశారు.

రెడ్‌జోన్‌ జిల్లాల పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టి వైరస్‌ తీవ్రతను అంచనా వేయాలని కేంద్రం సూచించింది. కేంద్ర నిర్ధారించిన రెడ్‌జోన్‌ జిల్లాలను విస్తృతి ఎక్కువగా (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) ఉన్నవి, కంటైన్మెంట్‌ క్లస్టర్ల ప్రాంతాలుగా విభజించారు. ఈ జిల్లాల్లో 14 రోజుల్లో కొత్త కేసులు నమోదుకాకపోతే.. రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌జోన్‌కు, ఆరెంజ్‌ నుంచి గ్రీన్‌జోన్‌కు మార్పు చేస్తారు. హాట్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు సరఫరా చేసి.. ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే వారంరోజులు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ అమలుచేయాలని, నిర్బంధ క్వారంటైన్‌ అమలుపరుచాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *