[spt-posts-ticker]

రాష్ట్రవ్యాప్తంగా 42 రోగ నిర్ధారణ కేంద్రాలు

మంత్రి ఈటల రాజేందర్‌

నారాయణగూడ, : తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏ సమస్య ఉందో గుర్తించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 42 రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు, గిరిజన ప్రాంతాల్లో మొబైల్‌ ల్యాబ్‌ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇండియన్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రేర్‌ డిసీజెస్‌(ఐఓఆర్‌డీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ‘ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అరుదైన వ్యాధుల నివారణ, అవగాహన’ అంశంపై జరిగిన సదస్సులో ఈటల మాట్లాడుతూ..  అరుదైన వ్యాధిగ్రస్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఐఓఆర్‌డీ ప్రత్యేక ఉపశమన కేంద్రాలను ఏర్పాటు చేసి అందిస్తున్న సేవలను కొనియాడారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *