[spt-posts-ticker]

కరోనా వైరస్‌ సోకకుండా ఆలయంలో ప్రత్యేక పూజలు

 

చిలుకూరు : భక్తుల గోవింద నామస్మరణతో చిలుకూరు బాలాజీ ఆలయం మార్మోగింది. గురువారం ఆలయంలో.. కరోనా వైరస్‌ బారి నుంచి ప్రజలను కాపాడాలంటూ.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌ డా.ఎంవీ సౌందరరాజన్‌, కన్వీనర్‌ గోపాలకృష్ణ స్వామి, పూజారి సీఎస్‌ రంగరాజన్‌ల ఆధ్వర్యంలో.. సుమారుగా 20 వేల మంది భక్తులతో కలిసి.. ఆలయంలో అపామర్జన స్తోత్ర మంత్రాన్ని పటించారు. కలశం, ఉత్సవ విగ్రహాలతో ఆలయంలో ప్రదిక్షణలు చేశారు. అంతకుముందు ప్రధాన ఆలయ ఆవరణలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిశా ఘటన సమయంలోనూ ఆలయంలో పూజలు నిర్వహించిన వెంటనే.. నిందితులకు కఠిన శిక్ష పడిందని తెలిపారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *