[spt-posts-ticker]

రూ.లక్షతో వెంటిలేటర్‌ తయారీ

సంగారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): కరోనా చికిత్సలో వెంటిలేటర్లు విరివిరిగా అవసరపడుతున్న తరుణంలో హైదరాబాద్‌ ఐఐటీ పరిశోధనా విభాగం చవకైన వెంటిలేటర్‌ను ఆవిష్కరించింది. కేవలం రూ.లక్షతో ఆధునిక హంగులతో ఈ వెంటిలేటర్‌ను రూపొందించారు. ఐఐటీహెచ్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏయిరో బయోసిస్‌ ఇన్నోవేషన్‌ అనే స్టార్టప్‌ విభాగం జీవన్‌లైట్‌ పేరుతో ఈ వెంటిలేటర్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వెంటిలేటర్లతో పోల్చితే జీవన్‌లైట్‌కు ఆధునిక హంగులు ఉన్నాయని హెచ్‌ఐఐటీ డైరెక్టర్‌ బీఎ్‌స.మూర్తి అన్నారు. వెంటిలేటర్‌ను మొబైల్‌ యాప్‌తో అనుసంధానించి రోగికి దూరంగా ఉంటూ చికిత్స నిర్వహించే వెసులుబాటు ఉందన్నారు. విద్యుత్తులేని ప్రాంతాల్లో కూడా లిథియం అయాన్‌ బ్యాటరీల ద్వారా ఐదు గంటల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. రిమోట్‌ సాయంతో నిర్వహించవచ్చునని ఐఐటీహెచ్‌ బయోమెడికల్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ రేణుజాన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున వెంటిలేటర్లను ఉత్పత్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పల్మనాలజీ (ఊపిరితిత్తుల విభాగం), క్రిటికల్‌ కేర్‌ చికిత్స వైద్య నిపుణుల సూచనల మేరకు జీవన్‌లైట్‌ను ఆధునీకరించామని  ఏయిరోబయోసిస్‌ స్టార్టప్‌ ప్రారంభకులు రాజేశ్‌ తంగవేలు, సిరిల్‌అంథోనీ వివరించారు. కాగా ఐఐటీ-రూర్కీకి చెందిన పరిశోధకులు కేవలం రూ.30వేలతో పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *