[spt-posts-ticker]

రెడ్‌క్రాస్‌ సేవలు దేశానికే ఆదర్శం

రాయదుర్గం,(ఆరోగ్యజ్యోతి) : ఎన్నిసార్లు రక్తదానం చేస్తే అన్ని ప్రాణాలు కాపాడినట్లని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నానక్‌రాంగూడ ఐటీ క్షేత్రంలోని సైయంట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. 500 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. గవర్నర్‌ ఈ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. నగరంలో డెంగీ నివారణకు రెడ్‌క్రాస్‌ సొసైటీ చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. తాను వృత్తి పరంగా గైనకాలజిస్ట్‌గా నవజాత శిశువుల బాగోగులు చూస్తానని, గవర్నర్‌గా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటున్నానని చెప్పారు. ప్రతిఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. సైయంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బీవీర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… సైయంట్‌ సంస్థ సామాజిక సేవలో ముందుందని, ప్రస్తుతం 14వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎస్‌ఆర్‌ కింద సేవలందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంస్థ దత్తత తీసుకున్న ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు రక్తదానం ప్రాధాన్యాన్ని తెలుపుతూ ప్రదర్శించిన లఘునాటిక విశేషంగా ఆకట్టుకుంది. గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ డైరెక్టర్‌ కె.పిచ్చిరెడ్డి, సైయంట్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *