[spt-posts-ticker]

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: పీవో గౌతమ్‌

 

ఇల్లెందు, (ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ గౌతమ్‌ సూచించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించన తర్వాత తొలిసారి పీవో శనివారం మండలంలో పర్యటించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఆయన డెంగీ నిర్ధరణ యంత్రం, ఐసీటీసీ కేంద్రం, రక్తనిధి కేంద్రం, మందుల గదులను సందర్శించారు. ప్రతి రోజు వైద్యశాలకు వచ్చే రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో బాలింతలు ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. గర్భిణులకు ప్రసవాల సమయంలో చేయాల్సిన శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే రక్తం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు మందులు సరి చూసుకోవాలని విధుల్లో ఎవరు అలసత్వం వహించినా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యుత్తు కార్యాలయం ఏరియాలో ఉన్న జీసీసీ కారం మిల్లును పరిశీలించారు. కారం ఉత్పత్తులను జీసీసీ డీఎం వాణిని అడిగి తెలుసుకున్నారు.

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రొంపేడు, కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పీవో తనిఖీ చేశారు. రొంపేడులోని బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని విధుల్లో అలసత్వం ఉండరాదని, సమయపాలన పాటించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భోజన వసతులను పరిశీలించి, విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో ప్రతిభ చూపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, నాణ్యమైన విద్యనందించాలని సూచించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *