[spt-posts-ticker]

లాక్‌డౌన్‌ పొడిగింపును స్వాగతిస్తున్నాం

హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి): కేంద్రం ఇచ్చిన సలహా మేరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇది అవసరమని, లాక్‌డౌన్‌కు ప్రజానీకం సహకరించాలని కోరారు. ఆదివారం పాతబస్తీ గౌలిపురాలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ ఫంక్షన్‌ హాల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.  బీజేపీ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వానికి, అధికారులకు సహయ సహకారాలు అందిస్తున్నారన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *