[spt-posts-ticker]

లైట్లు ఆపి.. జ్యోతులు వెలిగించండి

  • రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు
  • కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ ఫ్లాష్‌లు ఏవైనా

న్యూ ఢిల్లీ , (ఆరోగ్యజ్యోతి): ‘దేశవ్యాప్తంగా కరోనా వైర్‌స(కోవిడ్‌-19) మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత జాతి అంతా ఒకే తాటిపై ఉందన్న సత్యాన్ని మరోసారి రుజువు చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించి 9 రోజులు గడిచాయి. ఈ కాలంలో మీరు చూపిన క్రమశిక్షణ, సేవా స్ఫూర్తి అపూర్వం. ఇది ఇలానే కొనసాగాలి. సామాజిక దూరంపాటిస్తూ ప్రజలు విశేషంగా సంయుక్తంగా సంకల్పం చాటిచెప్పారు. ఇదే రీతిలో  ఏప్రిల్‌ 5వ తేదీన అంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలి. చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు లేదా సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు… ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలి. నా కోసం మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు కేటాయించండి. జనతా స్ఫూర్తిని మరోమారు చాటండి’ అని భారత ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు తన ట్విటర్‌ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *