[spt-posts-ticker]

వర్షాకాల వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి

  • దోమతెరలు పంపిణీ
  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బవేశ్ మిశ్ర 
  ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి):  వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పై జాగ్రత్తగా ఉండాలని  గిరిజన సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బవేశ్ మిశ్ర అన్నారు సోమవారం నాడు హస్నాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కామాయి పెట్  గ్రామంలో దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వల్ల మలేరియా, సీజనల్ వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దోమతెరలు పంపిణీ చేస్తుందన్నారు. ఈ దోమ తెరలను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలం వ్యాధులు సంభవించకుండ  ఉండేందుకు ఇంటి పరిసర ప్రాంతాలు ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు .అలాగే మురికి కాల్వలను శుభ్రం చేసుకుని గుంతలు ఉన్నచోట్ల నీటిని నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలోఅడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్, వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ , ఎఎంఓ  వెంకటేష్ , గోకుల్ కన్సల్టెంట్ సభన ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్త,లు పంచాయతీ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *