[spt-posts-ticker]

వెల్లుల్లి ఉపయోగాలు

ఆయుర్వేదము నందు వెల్లుల్లిని రసాయనకారిగా చెప్పబడినది. పక్షవాతము మొదలుకొని కుష్టు , గుండెజబ్బులు , కీళ్లనొప్పులు , జ్వరము , జీర్ణాశయ వ్యాధులు మొదలైన అనేక వ్యాధులలో వెల్లుల్లికి మించిన ఔషధము లేదు . వెల్లుల్లి అత్యుత్తమ జీర్ణకారిగా పనిచేయును . ప్రధానముగా మాంసాహారము మరియు నూనె , కొవ్వు పదార్ధాలు తినేవారు వెల్లుల్లి తప్పనిసరిగా వాడవలెను . మాంసాహారంలో , కొవ్వు పదార్ధములలో ఉండు కొవ్వును విరుగుడుగా వెల్లుల్లి పనిచేయును . గుండెజబ్బులును రానివ్వదు. గుండెజబ్బులు కలవారు , బాగా లావుగా ఉన్నవారు ప్రతిరోజూ రెండు లేక మూడు వెల్లుల్లి పాయలను ( పాయ అనగా విడగొట్టినప్పుడు వచ్చే ఒక భాగం ) వాడితే లావు తగ్గుతారు. గుండెజబ్బును రానివ్వదు.

స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పనిచేయును . ఋతుదోషములను పోగొట్టి సంతానవంతులుగా చేయును . ఊపిరితిత్తుల వ్యాధులలో వెల్లుల్లి పాలలో కలిపి ఉడికించి తాగిన ఆస్తమా , క్షయ , నిమోనియా తగ్గును. జలుబు కూడా తగ్గును. వెల్లుల్లి పట్టువేసిన తలనొప్పి , కీళ్లనొప్పులు తగ్గును. చర్మవ్యాధులను తగ్గించి చర్మానికి వర్ణము కలిగించును. వెల్లుల్లిపాయలను దంచి ఆ రసము 10 చుక్కలు చొప్పున ఒక కప్పు నీటిలో వేసి తాగించిన కోరింతదగ్గు తగ్గును. పక్షవాతము , ముఖము వంకరపోయే ఆర్థితవాతము , కీళ్లనొప్పులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పనిచేయును . శుక్రవృద్ధికారి .  చెవిపోటుతో ఇబ్బందిపడుతున్నప్పుడు  రెండు చిన్న వెల్లుల్లిపాయలను నూనెలో వేసి వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చెవిలో వేస్తె చెవిపోటు తగ్గును.

వెల్లుల్లి అతిగా తీసుకోకూడదు . అతిగా తీసుకోవడం వలన రక్తస్రావం , రక్తముతో కూడిన వాంతులు , రక్తపు విరేచనాలు అవుతాయి. ఈ మధ్యకాలంలో సరైన అవగాహన లేక పచ్చివెల్లుల్లి కొంతమంది తీసుకుంటున్నారు. అలా అవగాహన లేకుండా వెల్లుల్లి సరాసరి తీసుకోవడం వలన కడుపునందు అల్సర్ ( నాభివ్రణం ) వచ్చును. సరైన మోతాదులో మాత్రమే వేరే అనుపానంతో కలిపి తీసికొనవలెను . ఉష్ణశరీరం కలవారు వెల్లుల్లి చాలా తక్కువ మోతాదులో తీసుకొనవలెను .

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *