[spt-posts-ticker]

వైద్యరంగంలోనూ సాంకేతికతే కీలకం

బెంగళూరు  (ఆరోగ్యజ్యోతి) : వైద్య సేవల్లో ప్రాంతీయత, కులమతం, ఆర్థిక స్థోమతలకు చోటివ్వరాదని రాజీవ్‌ గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ సచ్చిదానంద్‌ అన్నారు. ఆయన స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ వైద్య కళాశాల పట్టభద్ర దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ‘వైద్య రంగంలో మారుతున్న సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం పరిశోధనాత్మక పరిశీలనతో వైద్య చికిత్సల్లో ప్రామాణికత సాధించాలి. ఈ క్రమంలో వివక్షకు చోటివ్వరాదు. యువ పట్టభద్రులు వ్యాపార ధోరణికంటే గ్రామాల్లో సేవలకు ఉపక్రమించడమే ముఖ్యం’ అని పిలుపునిచ్చారు. జయదేవ్‌ గుండె వైద్య విజ్ఞాన సంస్థ సంచాలకుడు డాక్టర్‌ సి.ఎన్‌.మంజునాథ్‌ మాట్లాడుతూ విలువలతో కూడిన వైద్య సేవలు దేశ ఆరోగ్య ప్రమాణాలను పెంచుతాయన్నారు. నిరంతర ఆరోగ్య పరీక్షలతో ప్రమాదకరమైన జబ్బులకు దూరంగా ఉండాలన్నారు. ఈ దిశగా యువతరం సమాజాన్ని జాగృతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ విద్యా సంస్థల అధ్యక్షుడు ఎస్‌.ఎన్‌.వి.ఎల్‌.నరసింహరాజు, సంచాలకుడు వై.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *