ఆదిలాబాద్, ఉట్నూర్.(ఆరోగ్యజ్యోతి): వైద్య విధాన పరిషత్ హాస్పటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మెడికల్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సుభాష్ తెలిపారు.వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నార అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆగస్టు 1న ఐటీ మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది అని సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 487 మంది వైద్యులు 1860 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని వీరందరికీ ఏప్రిల్ నెల నుంచి నేటి వరకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు వివిధ రకాల వ్యాధులతో పాటు కరోనా వ్యాధి కూడా పడ్డారని తెలిపారు.వేతనాలు రాకపోవడం వలన ఉద్యోగులు సమస్యలతో సతమతమవుతున్నారు అని తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నారని వెంటనే ప్రభుత్వం వేతనాలు విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వైద్యులు మెడికల్ పారామెడికల్ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైద్యవిధాన పరిషత్ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలి
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]