[spt-posts-ticker]

వైద్యసేవల పథకం దరఖాస్తులకు నెలాఖరు వరకు గడువు

శ్రీరాంపూర్‌, (ఆరోగ్యజ్యోతి): సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంతులకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి సవరించిన సీపీఆర్‌ఎంఎస్‌ (కాంట్రిబ్యూటరీ పోస్ట్‌ రిటైర్‌మెంట్‌ మెడికేర్‌ స్కీం)లో చేరడానికి ఈ నెలాఖరు వరకే గడువు ఉందని శ్రీరాంపూర్‌ ఏరియా డీజీఎం (పర్సనల్‌) పి.గోవిందరాజు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేకర్లలో మాట్లాడుతూ.. కోల్‌ ఇండియాలో కుదిరిన జేబీసీసీఐ ఒప్పందం మేరకు మెరుగైన వైద్య సేవల ఖర్చును రూ.5 నుంచి రూ.8 లక్షలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గడువులోగా నిర్ణీత మొత్తం చెల్లించి కార్మికులు, వారి జీవిత భాగస్వాములకు వైద్య పథకంలో సభ్యత్వం పొందాలని కోరారు. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపులు ఉండవని, సవరించిన కొత్త పథకంలో చేరడానికి విశ్రాంత ఉద్యోగితోపాటు వారి జీవిత భాగస్వామికి కలిపి రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గతంలో రూ.40 వేల కన్నా తక్కువ మొత్తం చెల్లించినవారు కొత్త పథకంలో చేరడానికి మిగతా సొమ్ము జమ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఉదాహరణకు గతంలో రూ.15 వేలు, రూ.20 వేలు చెల్లించిన వారికి పాత పథకం ప్రకారం రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తారని, కొత్త పథకం ప్రకారం రూ.8 లక్షలు వర్తించాలంటే రూ.40వేల మొత్తానికి ఎంత తక్కువైతే అంత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల మరింత మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *