హైదరాబాద్: కరోనాపై పోరులో భాగంగా పీఎం కేర్స్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ.కోటి కేటాయించడంతోపాటు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన పిలుపు మేరకు రాష్ట్ర భాజపా కార్యకర్తలు పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు అందించినట్లు తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి రూ.50 లక్షలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ‘కరోనా మహమ్మారిని తరిమేద్దాం-దేశాన్ని గెలిపిద్దాం’ అంటూ పీఎం కేర్స్ సహాయ నిధికి విరాళాలు అందించిన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఈ సందర్భంగా బండి కృతజ్ఞతలు తెలిపారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]