[spt-posts-ticker]

వైద్యులపై దాడి సరికాదు

భగత్‌నగర్‌ : కరోనా కట్టడిలో అత్యంత కీలక దశలో ఉన్నామని, దీనికి ప్రజలు సహకరించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌లోని 9వ డివిజన్‌ కోతిరాంపూర్‌లో ఉచిత బియ్యం పంపిణీతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికొంతకాలం సహకరించాలన్నారు. తమకేం కాదనే భావన సరైంది కాదన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. డాక్టర్లపై దాడి సరైందని కాదన్నారు. బియ్యం పంపిణీ సమయంలో పరిశుభ్రతను పాటిస్తూ సామాజిక దూరం పాటించాలని చెప్పారు. పోర్టబులిటీ సౌకర్యం ఉందని, ఇతర జిల్లాలకు చెందిన వారు సమీపంలోని రేషన్‌ దుకాణాల్లో బియ్యం తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్లు ఐలేందర్‌ యాదవ్‌, లెక్కల స్వప్న, వేణుగోపాల్‌, పన్యాల శ్యామ్‌ సుందర్‌రెడ్డి ఉన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *