[spt-posts-ticker]

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌ (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే అత్యవసర వైద్యం చేసేందుకు జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని శనివారం జడ్పీ ఛైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రావు దగ్గరుండి విభాగంలో ఏర్పాటు చేసిన వైద్యులు, సిబ్బంది వివరాలు తెలిపారు. ఆసుపత్రికి దూరంగా ప్రత్యేకంగా ఉన్న ఈ గదులను కరోనా విభాగం కోసం ఉపయోగించినట్లు తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌ మాట్లాడుతూ ఈ వ్యాధి లక్షణాల విషయంలో ఆసుపత్రి వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా ప్రత్యేక విభాగానికి తరలించాలని సూచించారు. జడ్పీ ఛైర్మన్‌తో పాటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ భీమ్‌సింగ్‌, తిరుపతి రావు, విశాల్‌, బాల్‌రాజ్‌ తదితరులు ఉన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *