[spt-posts-ticker]

వైద్యుల సమస్యలను పరిష్కరించండి

– ఆరోగ్య శాఖ మంత్రికి వినతి పత్రం

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ పూర్ణచందర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులకు పీజీ లో 50 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులకు వాహన సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాహనాల కొరకు అలవెన్స్ మంజూరు చేయాలని వారు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 10%  అలవెన్స్ చెల్లిస్తానని కేవలం రెండు నెలలకు మాత్రమే చెల్లించాలని మిగితా అలవెన్సులు ఉద్యోగులందరికీ వేయాలని ఈ సందర్భంగా వారు మంత్రికి సూచించారు. వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్న వైద్యులకు ప్రారంభ వేతనం 80 వేల రూపాయలు ఉందని అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు 60 వేల రూపాయల వేతనం మాత్రమే ఉందని వారితో సమానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు పని చేస్తున్నారని సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *