[spt-posts-ticker]

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి

– టిఆర్ఎస్ కేవీ అధ్వర్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్కు వినతిపత్రం 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): యన్ యం నుండి హెచ్ వి(యఫ్) పదోన్నతి గురించి పి హెచ్ యన్ నుండి సి హెచ్ ఓ(యఫ్) పదోన్నతుల గురించి వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించలని   తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 టిఆర్ఎస్ కేవీ అధ్వర్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్ వాకాటి కరుణ ఆఫీస్ లో కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా  స్టెట్ వర్కింగ్&ఇన్ చార్జి ప్రెసిడెంట్ రాబర్ట్ బ్రుస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర రవి, రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి అరుణ,స్టెట్ జాయింట్ సెక్రటరీ రాధిక,కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్ హెచ్ యం చైర్మన్ షాఖీర్, ప్రధాన కార్యదర్శి హనుమంత రావులు మాట్లాడుతూ కరోనా సమయములో విధులను నిర్వహిస్తున్న రెగ్యులర్ ,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషీయా మంజూరు చేయాలని వారు డిమాండ్ చేసినారు.అలాగే  10% ఇన్సెంటివ్ మిగితా నెలలు ఇప్పించగలరు. ఎ యన్ యం లకు రావాలసిన నటువంటి సబ్ సెంటర్ రెంట్, వాక్సిన్ క్యారియర్ అలవేన్స్ రావటం లేదు వీటిని ఇప్పీంచలని వారు కోరినారు. 2వ ఎ యన్ యం,  అర్బన్ హెల్త్ సెంటర్ ఎ యన్ యం లకు వెతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించి  రెగ్యులర్  చేయాలని కమిషనర్ దృష్టికి తిసుకేల్లినారు.  కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్  మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవు మంజూరు చేయాలని,కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం ఉద్యోగులకు చనిపోయిన ఉద్యోగి ఇంటి లో ఒకరికి ఉద్యోగం కల్పించుట మరియు 25 లక్షల ఇన్సూరెన్స్ చెల్లించాలని,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరినారు. ఎ యన్ యం లకు ద్విచక్ర వాహనము(స్కూటీ) ప్రభుత్వ పరంగా  ముఫ్ఫై వేల రూపాయలు సబ్సిడీగా ఇప్పీంచని తెలిపినారు.ఈ కార్యక్రమంలో బుజ్జి, లీలావతి,లత,దెవమ్మ, పి పద్మ,రమా, విజయ,  ఈ  పద్మ, కనుక లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *