[spt-posts-ticker]

వైద్య రంగంలో నర్సుల సేవలు కీలకం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై

చందానగర్‌: వ్యాధితో కుంగిపోయిన రోగికి మానసిక దృఢత్వాన్ని కల్పించడంలో నర్సులు అందించే సేవలు ఎంతో కీలకమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. శుక్రవారం చందానగర్‌లో మహిళా దక్షత సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీబీ బజాజ్‌ నర్సింగ్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి వెలిగించి ప్రాంగణంలో విద్యార్థినుల కోసం నూతనంగా నిర్మించిన వసతిగృహాలను ఆమె ప్రారంభించారు. గోవా మాజీ గవర్నర్‌ మృదులా సిన్హా, మాజీ రాష్ట్ర కార్యదర్శి వినోద్‌ అగర్వాల్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మహిళ దక్షత సమితి అధ్యక్షురాలు డాక్టర్‌ సరోజ్‌ బజాజ్‌లతో కలిసి కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. సుమన్‌ కళాశాల విద్యార్థినుల పునర్‌కృతి కళాశిబిరం ఆల్బమ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై ప్రసంగిస్తూ.. ఆసుపత్రుల్లో నర్సులు విధి నిర్వహణపై వివరిస్తూ.. రోగులను ప్రేమ, ఆప్యాయతలతో నవ్వుతూ పలకరించి సమయానుకూలంగా వ్యవహరించడమే ప్రధానమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలికలకు నర్సింగ్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చిన డాక్టర్‌ సరోజ్‌బజాజ్‌ సేవలను కొనియాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సేవలు ఇంకా విస్తరించాలని, అందుకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. గోవా మాజీ గవర్నర్‌ మృదులా సిన్హా మాట్లాడుతూ.. మహిళా దక్షత సమితి ట్రస్ట్‌లో ఒక సభ్యురాలిగా ఉండటం గర్వకారణమని వివరించారు. మహిళా దక్షత సమితి సభ్యులు సుమన్‌ కృష్ణకాంత్‌, అరుణమలాని, లక్ష్మి, కళాశాల ప్రిన్సిపాళ్లు రమాకుమారి, సుశీలాపాటిల్‌, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *