[spt-posts-ticker]

వైరస్‌ కొత్త విషయాలివీ…

వాషింగ్టన్‌: మానవాళిని వణికిస్తున్న కరోనా కొత్త వైరస్‌ ‘సార్స్‌-కొవ్‌-2’ గురించి సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైరస్‌ గాల్లో 3 గంటలపాటు సజీవంగా ఉండి మానవుల్లోకి ప్రవేశించగలదని తాజా అధ్యయనమొకటి గుర్తించింది. ప్లాస్టిక్‌ ఉపరితలాలపై మూడు రోజుల వరకూ క్రియాశీలకంగా ఉండగలదని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటానికి ఈ సామర్థ్యమే ప్రధాన కారణమని అభిప్రాయపడింది. మానవ శరీరం వెలుపల కరోనా మనుగడ సాగించే అవకాశాలు.. 2002-03 మధ్య సార్స్‌ విజృంభణకు కారణమైన సూక్ష్మజీవి సామర్థ్యం స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని పరిమితులున్నాయన్న వాదనలు కూడా వచ్చాయి. ‘సార్స్‌-కొవ్‌-2’ అనేది నావెల్‌ కరోనా వైరస్‌కు సాంకేతిక నామం.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *