[spt-posts-ticker]

వైరస్‌ బారిన పడకుండా.. ఐసా కరోనా!

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ముప్పు ఊహించినదానికంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. మనదేశంలో రెండోదశకు చేరడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. మొదటి దశలో విదేశాల నుంచి వచ్చిన భారతీయుల్లోనే ఇది బయటపడటం.. ఇటీవల వారి నుంచి ఇతరులకు వ్యాపించడం కలవరపెడుతోంది. వైరస్‌ పూర్తిగా కొత్తది కావడంతో ఇప్పటివరకు ఔషధాలు అందుబాటులో లేవు.  ముందుజాగ్రత్తగా వైరస్‌ల బారినపడకుండా ఉండటం ఒక్కటే ప్రస్తుతం మనచేతుల్లో ఉంది. వైరస్‌కు లొంగకుండా మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతోపాటు.. ఇంటి చిట్కాలతోనూ వైరస్‌ల నుంచి కాపాడుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు, కలబంద, వేప, తులసి మొక్కల్లో యాంటివైరల్‌ ఔషధ గుణాలు ఉన్నాయని.. మన పెద్దలు వైరస్‌ల బారిన పడకుండా వీటినే వాడేవారని కరోనా నుంచి కూడా రక్షణ ఉంటుందని సైఫాబాద్‌ పీజీ కళాశాల వృక్షశాస్త్ర సహా ఆచార్యులు డాక్టర్‌ ఎం.వెంకటరమణ అంటున్నారు.

* పసుపు (టర్మరిక్‌): పసుపులో యాంటి వైరల్‌ ఔషధ గుణాలు ఉన్నాయి. స్త్రీలు ఎక్కువగా పసుపు కుంకుమ ఉపయోగించడంతో వైరస్‌ల బారి నుంచి తప్పించుకునేవారు. ఇప్పుడు ఇవి ఆచరణీయం. ఇంట్లోంచి బయటకెళ్లేటప్పుడు చేతులకు పసుపు రాసుకుంటే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

* కలబంద (అలోవెరా): కలబంద ఆకు జిగురులో యాంటి వైరల్‌ ఔషధ గుణాలున్నాయి. కలబంద రసాన్ని బయటకు వెళ్లే ముందు ఆడవారైనా, మగవారైనా ముఖానికి, చేతులకు కొద్దిగా పెట్టుకుని వెళ్తే వైరస్‌ల నుంచి రక్షణగా ఉంటుంది.

* వేప (నీమ్‌): వేపాకుల్లో యాంటివైరల్‌ ఔషధ గుణాలున్నాయి. జాతర, బోనాల ఉత్సవాల్లో వేప కొమ్మలను, ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. జనసమూహాలు ఉన్న చోట వైరస్‌ల నుంచి కాపాడుకునేందుకు వేప కొమ్మలను కట్టేవారు. వేప ఆకులను, కొమ్మలను ఇంటి ముందు వేలాడదీయడం అన్నివిధాలా మేలు. వేప లేత చిగురు, ఆకులను తినడం వల్ల వైరస్‌ల బారి నుంచి కాపాడుకోవచ్చు.

* తులసి: తులసి ఆకుల్లోనూ చక్కటి ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను తినడం, తులసి తీర్థం తీసుకోవడం, ఇంటి ముందు తులసి చెట్టు పెంచి పూజించడం ద్వారా వైరస్‌ల నుంచి రక్షించుకోవచ్చు.

వెల్లుల్లి, ఉల్లి, జీలకర్ర, మిరియాలు, అల్లంలోనూ యాంటివైరల్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌ ఔషధ గుణాలున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *