[spt-posts-ticker]

శిరోజాల సంరక్షణకోసం.

అమ్మాయిలకు శిరోజాలే అందం. పాత కాలంలో ఒక్కొక్కరికి జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండడంతోపాటు ఆకర్షణీయంగా ఉండేది. ఇప్పుడు వాతావరణ కాలుష్యం, ఒత్తిడి కారణంగా ప్రతిఒక్కరిలో జుట్టు సమస్యలు మొదలవుతున్నాయి. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తోనే జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

* కోడిగుడ్డు తెల్లసొనలో రెండు టీ స్పూన్‌ల బోరిక్‌ పౌడర్‌ కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరువాత తలను శుభ్రపరుచుకోవాలి.

* వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్లకు మంచి పోషణ లభించి, శిరోజాలు నిగనిగలాడుతాయి.

* కొన్ని ‘టీ’ ఆకులు వేసి నీళ్లను మరిగించాలి. చల్లారిన తర్వాత తలకు పట్టించాలి.

* ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

* తగినన్ని తులసి ఆకులను శుభ్రపరిచి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ని జుట్టు కుదుళ్లకు పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే చర్మసమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

* దీనివల్ల తలలో పేలు కూడా అరికట్టవచ్చు.

* నాలుగు ‘టీ’ స్పూన్ల నిమ్మరసంలో రెండు ‘టీ’ స్పూన్‌ల కొబ్బరి పాలు కలుపాలి.

* ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకంతటికీ పట్టించి అరగంట తరువాత తలస్నానం చేయాలి.

* పదిహేను రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే.. శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *