బోధన్ : బోధన్ 108 అంబులెన్సులో ఏడు నెలల గర్భిణికి క్లిష్టమైన కాన్పు నిర్వహించి చలనం లేని బిడ్డకు సీపీఆర్ చికిత్సలు నిర్వహించి రక్షించారు. ప్రసవానంతర సేవల కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. వర్ని మండలం చింతకుంట గ్రామానికి చెందిన స్వరూప ఏడు నెలలకే పురిటి నొప్పులతో బాధపడుతుండడంతో గురువారం 108కు సమాచారం అందించారు. బోధన్ అంబులెన్సు సిబ్బంది గ్రామానికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మార్గమధ్యలో నొప్పులు తీవ్రమై శిశువు కాళ్లు బయటకు రావడంతో వాహనాన్ని నిలిపివేశారు. ఈఆర్సీ వైద్యులతో ఫోన్లో సంప్రదించిన ఈఎంటీ లక్ష్మణ్ చికిత్స ప్రారంభించారు. వారి మార్గదర్శకాలను అనుసరించి కాన్పు నిర్వహించగా మగ శిశువు జన్మించింది. ఏడు నెలలకే పుట్టిన శిశువులో చలనం లేకపోవడంతో కంగారు చెందినా… తదుపరి సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) సేవలు అందించడంతో పసిగుడ్డు కోలుకుంది. వెంటనే వారిద్దరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్లిష్టమైన సేవలను అంబులెన్సులో అందించడంపై బాలింత కుటుంబ సభ్యులు ఈఎంటీ లక్ష్మణ్, పైలట్ మురళిలను అభినందించారు.
శిశువుకు సీపీఆర్ చికిత్సతో ప్రాణం
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]