[spt-posts-ticker]

శిశువు మృతి.. బంధువుల ఆందోళన

మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో ఓ శిశువు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకొంది. శిశువు మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే..పట్టణంలోని రబ్బానిపురకు చెందిన శీమా బేగం(20) తొలి ప్రసవం కోసం గురువారం ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి నొప్పులు రావడంతో వైద్యురాలు సాధారణ ప్రసవం చేశారు. ప్రసవం సమయంలో బాబు తల, చేతుకు గాయాలయ్యాయి. వెంటనే ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల వైద్యుడు పరీక్షించి తలకు, చేతులకు కుట్లు వేశారు. ఆదివారం తెల్లవారుజామున బాబు చనిపోయాడని తీసికెళ్లమని పిల్లల వైద్యుడు చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మృతికి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ సామాజిక ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. కాగా ఈ విషయమై ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్‌ ఛైతన్యసుధను ’ వివరణ కోరగా రోగిని, చిన్న పిల్లలను చంపాలని ఏ వైద్యులకు ఉండదని అప్పుడప్పుడు మరణాలు సంభవిస్తుంటాయని, బాబు మృతి చెందడంలో వైద్యురాలి నిర్లక్ష్యం లేదన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *