సంగారెడ్డి ,(ఆరోగ్యజ్యోతి):సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు అధికారికంగా ప్రకటించారు. ఈ ఆరుగురు కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారే అని తెలిపారు. వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించామని.. అలాగే ఈ ఆరుగురికి సంబంధించిన 43 మంది ఫ్యామిలీ సభ్యులను పరీక్షించామని చెప్పారు. వారి రిపోర్ట్ శుక్రవారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు మంత్రి హరీష్ రావు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 133కి చేరుకున్నాయి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]