టంగుటూరు, (ఆరోగ్యజ్యోతి): విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు చెప్పారు. ఆలకూరపాడు గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన మెనూతో రూపొందించిన మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం తనిఖీ కోసం నాలుగంచల విధానం అమల్లో ఉందని చెప్పారు. తల్లిదండ్రుల కమిటీలు విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించాలన్నారు. భోజన పథకం కోసం మొబైల్ యాప్ రూపకల్పన జరుగుతున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పులిహోర, టమోటా పప్పు, గుడ్డు వడ్డించారు. కార్యక్రమంలో తహసీల్దారు ఉష, ప్రధానోపాధ్యాయిని , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]