[spt-posts-ticker]

సరైన పోషకాహారంతోనే మంచి ఆరోగ్యం

జూబ్లీహిల్స్‌: ఆహారానికి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం రీత్యా ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని ఇంటిపంట నిపుణులు రఘోత్తమరెడ్డి సూచించారు. ఇంటి పంట ద్వారా సహజంగా పండించిన కాయగూరలు, ఆకుకూరలు ఎంతో మేలన్నారు. ఖైరతాబాద్‌లోని రైతునేస్తం కార్యాలయంలో ఆదివారం ఇంటి పంటపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ప్రతి ఇంటి పెరట్లో, అవకాశం ఉన్న చోట కూరగాయలు పెంచేవారన్నారు. ఇప్పుడు మారిన జీవనశైలి, వ్యాపకాలు, భూముల ధరల పెరుగుదల కారణంగా వాటికి దూరమవుతున్నారన్నారు. మార్కెట్లో చాలా మేరకు రసాయన అవశేషాలున్న కాయగూరలు లభిస్తున్నాయని, వాటితో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై.వేంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆకుకూరల వల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. ఇంటిపంట బహుళార్ధక సార్థక ప్రాజెక్టు అని.. దీనివల్ల వ్యాయామం కూడా లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఇంటిపంట సాగు చేసే వారికి అవసరమైన మెలకువలను, సూచనలు అందించారు. అనంతరం రైతునేస్తం కార్యాలయంలో ఏర్పాటుచేసిన మిద్దెతోటను పరిశీలించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *