మంచిర్యాల:మంచిర్యాల జిల్లా ఆసుపత్రి.. సదుపాయాలు, వైద్యసేవల్లో మెరుగుపడుతోంది. ధర్మాసుపత్రిపై పాలనాధికారి ప్రత్యేక చొరవ, ఇక్కడి పర్యవేక్షకుల నిరంతర నిఘాతో రోజురోజుకు వృద్ధి చెందుతోంది. మొన్నటి వరకు చిన్నారుల వైద్యానికి ప్రత్యేక గది లేకపోవడంతో వరండాలోనే చికిత్స చేసేవారు. ఇక్కడ నడిచేందుకే యాతన పడాల్సి వచ్చిన ఈ ప్రాంతం ప్రస్తుతం విశాలంగా మారింది. భవనాలు నిర్మాణం చేపట్టడం, జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీల్లో నిరుపయోగంగా ఉన్న పడకలను తెప్పించడంతో పిల్లల విభాగానికి ఇబ్బంది తొలగింది. ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స అందిస్తున్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]