- స్వీయ నిర్బంధంలో రాజు, యువరాజు
రియాద్: సౌదీ రాజకుటుంబానికి కరోనా సోకినట్లు తెలుస్తున్నది. ఆ కుటుంబంలో 150 మంది వైరస్ బారినపడినట్లు అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. రాజ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి తమకు ఈ సమాచారం చెప్పారని తెలిపింది. అయితే వైరస్ సోకిన వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రాజ కుటుంబం, వారితో సన్నిహితంగా మెలిగే వారి కోసం ఇప్పటికే ఓ దవాఖానలో 500 పడకలను ఏర్పాటుచేశారు. దేశంలో కరోనా కేసులు 2 లక్షల వరకు పెరుగొచ్చని ఆరోగ్య శాఖ మంత్రి తౌఫిక్ అల్ రబియా అంచనా వేశారు. అక్కడ ఇప్పటి వరకు 2,932 కరోనా కేసులు నమోదు కాగా.. 41 మంది మరణించారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]