హైదరాబాద్: స్టార్హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అవుట్ పేషెంట్ సేవలకు అనువైన ఆరోగ్య బీమా పాలసీని ఆవిష్కరించింది. అవుట్ పేషెంట్ సేవలు, కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, మందుల బిల్లులు.. తదితర అవసరాలన్నీ ఈ పాలసీలో కవర్ అవుతాయి. 18 – 50 ఏళ్ల వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఒక కుటుంబంలో ఆరుగురి వరకూ బీమా భద్రత లభించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కొనుగోలు చేయొచ్చు. రూ.1 లక్ష వరకు కవరేజీ లభించే పాలసీ ఉంది. కొన్ని జబ్బులకు అవుట్ పేషెంట్‌గానే చికిత్స తీసుకోవచ్చు. అలాగని ఆ చికిత్సకు తక్కువ ఖర్చేంకాదు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ‘స్టార్ అవుట్‌పేషెంట్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ’ తీసుకువచ్చామని స్టార్హెల్త్ ఎండీ ఆనంద్ రాయ్ పేర్కొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]