హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):గ్రేటర్హైదరాబాద్ లో గురువారంనాడు మరో 24 బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా 200 బస్తీ దవాఖానలను ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. ఈ బస్తీ దవాఖాన వల్ల ప్రజలకు మంచి సేవలు అందడం వల్ల ప్రభుత్వం దనంగా మరో 24 బస్తీ దవాఖానలను గురువారం ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్రావు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోం మంత్రి మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్లతోపాటు పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ్యులు, స్థానిక కార్పొరేటర్లు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు మేయర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న బస్తీ దవాఖానలు
- అంబర్‌పేట సర్కిల్-మౌలాన ఆజాద్ కమ్యూనిటీ హాల్
- ఖైరతాబాద్ సర్కిల్-సయ్యద్‌నగర్, ఎమ్మెల్యే కాలనీ
ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
- ఖైరతాబాద్ సర్కిల్ బీఎస్ మక్తా కమ్యూనిటీ హాల్
- కుత్బుల్లాపూర్-దత్తాత్రేయనగర్
హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
- చార్మినార్ సర్కిల్-పత్తర్‌గట్టి
- మలక్‌పేట్ సర్కిల్-దారుల్షిఫా
- చంద్రాయణగుట్ట-ఈదీ బజార్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
- ముసాపేట్ – పిల్లర్నం.ఏ827, కూకట్పల్లి
- ముసాపేట్ – అవంతినగర్, ఎర్రగడ్డ
- మల్కాజిగిరి సర్కిల్ – నేరెడ్మెట్
- మల్కాజిగిరి సర్కిల్ – స్ట్రీట్ నం.29, గౌతంనగర్
పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- ముషీరాబాద్-ఎంసీహెచ్ ప్లే గ్రౌండ్ , రాంనగర్
- గోషామహల్-మంగళ్హాల్ ఈస్ట్
- ముషీరాబాద్-జవాహర్‌నగర్, కవాడిగూడ
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- సరూర్‌నగర్ సర్కిల్-భరత్సింగ్నగర్, వెంకటేశ్వరకాలనీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- సికింద్రాబాద్ సర్కిల్-పార్శిగుట్ట, పద్మారావునగర్ సికింద్రాబాద్ సర్కిల్-ఇందిరానగర్
డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్
- ఖైరతాబాద్ సర్కిల్-ముజాహిద్‌నగర్, సీతారాంబాగ్
- సంతోష్‌నగర్ సర్కిల్-పటేల్‌నగర్ హాల్, లాల్ దర్వాజ
నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించే బస్తీ దవాఖానాలు
- కార్వాన్-మరాఠీబస్తీ రోడ్, కార్వాన్ ఈస్ట్,
- మెహిదీపట్నం-సాబేర్నగర్కాలనీ సయ్యదఖ్ అలీ గూడ ,
- సంతోష్‌నగర్-తలాబ్‌కట్ట,
- చార్మినార్సర్కిల్-మిస్త్రీగంజ్, రాంనాస్పుర,
- చార్మినార్ సర్కిల్-సుల్తాన్ షాహీ, గౌలిపుర,