ఆదిలాబాద్ : ప్రధాన్ మంత్రి జన ఔషది పరియోజన కేంద్రం(రిమ్స్)లో ఫార్మాసిస్ట్ ఉద్యోగం కోసం దరఖాస్తులు చేసుకున్న ఎస్టీ, ఎల్ఎస్టీ అభ్యర్థులకు ఈ నెల 10న డీఎంహెచ్ఓ కార్యాలయంలో మౌఖిక పరీక్ష ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యారోగ్యాధికారి తొడ్సం చందు ఒక ప్రకటనలో తెలిపారు. డీఎంహెచ్ఓ కార్యాలయం 2019 ఆగస్టు 16న విడుదల చేసిన ప్రకటన(సంఖ్య 4345/2019) మేరకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు తమ నిజ ధ్రువపత్రాలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు. విధి, విధానాలకు లోబడి ఉన్న అభ్యర్థులలో ఒకరిని ఎంపిక చేయటానికి మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]