కొణిజర్ల: సత్తుపల్లి ఆసుపత్రి నుంచి ఖమ్మం ప్రధాన ఆసుపత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా ఓ గర్భిణి మార్గమధ్యలో ప్రసవించిన సంఘటన కొణిజర్ల మండల తనికెళ్ల సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం గంగారానికి చెందిన జయలక్ష్మి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో బిడ్డ ఉమ్మనీరు తాగిందనే కారణంతో సత్తుపల్లి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలనే వైద్యులు సూచనల మేరకు 108లో తరలిస్తున్నారు. తనికెళ్ల సమీపంలోకి రాగానే నొప్పులు అధికమై వాహనంలో కాన్పు జరిగింది. మగబిడ్డకు జన్మనివ్వడంతో పాటు తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో వాహన సిబ్బంది ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాన్పుకు 108 ఈఎంటీ కె.మాధవరావు, పైలెట్ మల్సూరులు వైద్య సేవలందించారు.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]