ఆదిలాబాద్: ఇటీవల దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి వివరాలను సేకరించేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తపై ఆ కుటుంబ సభ్యులు దాడికి యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ పట్టణంలోని చిలుకూరి లక్ష్మీనగర్ పట్టణ పీహెచ్సీ పరిధిలోని శివాజీచౌక్ సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఇటీవల దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. వివరాలను సేకరించడానికి వెళ్లిన ఆశా కార్యకర్త భారతిని కుటుంబ సభ్యులు దుర్భాషలాడుతూ దాడి చేయడానికి ఇంట్లోకి లాక్కెళ్లారు. భయభ్రాంతులకు గురైన ఆమె వారి నుంచి తప్పించుకుని పారిపోయింది. అనంతరం ఈ విషయం మిగిలిన ఆశా కార్యకర్తలకు తెలుపగా వారంతా కలిసి డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నా తమకు మాస్కులు, శానిటైజర్లు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ విషయం డీఎంహెచ్ఓ టి.చందు దృష్టికి తీసుకెళ్లగా జరిగిన ఘటన గురించి పాలనాధికారి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆశా కార్యకర్తలు తెలిపారు.
ఆదిలాబాద్‌లో ఆశా కార్యకర్తపై దాడికి యత్నం
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]