[spt-posts-ticker]

167 ఏళ్లలో రైళ్లు బందవడం ఇదే మొదటిసారి

న్యూ ఢిల్లీ : కరోనా కంట్రోల్ కోసం ఇండియన్ రైల్వే ఇంతకు ముందెన్నడూలేని విధంగా నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ ట్రైన్లసర్వీసులను మూడు వారాల పాటు నిలిపేసింది. 167 ఏళ రైల్వే చరిత్రలో  ప్రయాణికుల బండ్లన్నీ పట్టాలపైకి ఎక్కకపోవటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సుమారు 20 వేల పాత ట్రైన్ క్యారేజ్ లను కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ వార్డులుగా మార్చుతున్నా రు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటానికి ప్రధాని మోడీ ఈ నెల 14 వరకు నేషనల్ లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా రైల్వేస్ రైళను నిల లిపేసింది.

మామూలు నెట్వర్క్ కాదు

ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో నాలుగో పెద్ద నె ట్వర్క్. ఆసియాలో పాతది. దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రభుత్వ సంస్థ. మొత్తం 16 జోన్లు ఉన్నాయి. రోజుకి 20 వేలకుపైగా ప్యాసింజర్ ట్రైన్లు లాంగ్ డిస్టె న్స్, సబర్బన్ రూట్లలో 7,349 స్టే షన్ల ద్వారా 67,368 కిలోమీటర్లమేర రాకపోకలు సాగిస్తాయి. రైల్వేల ఆధ్వర్యంలో ఇప్పటికే 125 ఆసుపత్రులు ఉద్యోగులకు వైద్యసేవలు అందిస్తున్నాయి. ఆయా హాస్పిటల్స్ లోని డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందితో కరోనా రోగులకు ట్రీట్మెంట్ ఇప్పించాలని చూస్తున్నారు. ‘కరోనా పేషెంట్ల క్లీన్, శాని టైజ్డ్, హైజీనిక్ పరిస్థితుల్లో సౌకర్యవంతంగా కోలుకునేలా సేవలు అందిస్తాం’ అని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ చెప్పారు. రైల్వే ఫ్యాక్టరీలకూ ఆర్డర్లు కరోనా వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన సర్వీస్ లను అందించేందుకు కేంద్రం రైల్వే ఫ్యాక్టరీలనూ అలర్ట్ చేసింది. హాస్పిటల్ బెడ్లు, స్ట్రె చర్లు, మెడికల్ ట్రాలీలు, మాస్క్ లు, శానిటైజర్లు, ఆప్రాన్లు, వెంటిలేటర్లవంటి మెడికల్ ఆపరేటస్ తయారీకి ఏ మేరకు అవకాశం ఉందో పరిశీలించాలని సూచించింది.

5వేల ఐసోలేషన్ వార్డులు

ప్యాసింజర్ రూట్ల లో వినియోగించని నాన్-ఏసీ క్యారేజ్ లను గుర్తించి హాస్పిటల్స్ గా మార్చాలని, ఎమర్జెన్సీ తలెత్తినప్పుడు వాడుకోవటానికి వీలుగా సిద్ధం చేయాలని రైల్వే బాస్ లు జోనల్ మేనేజర్లను ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఐదు వేల ఐసోలేషన్ వార్డులు రెడీ కానున్నాయి. ఇంకాకావాలంటే 48 గంటల్లో మిగతా వాటిని కూడా అందుబాటులోకి తెస్తామని రైల్వే బోర్డ్ ఇన్ఫర్మేషన్, పబ్లిసిటీ ఈడీ రాజేష్ దత్ బాజ్ పేయి తెలిపారు. ఒక్కో క్యారేజ్ లో 16 మంది రోగులను ఉంచొచ్చు. నర్స్ స్టేషన్, డాక్టర్ల కేబిన్, మెడికల్ సప్లై, ఎక్విప్మెంట్ కీ చోటు కల్పించవచ్చు. ట్రైన్ ఒకసారి కదిలితే… దాన్ని హాస్పిటల్ బెడ్లు తక్కువగా ఉన్న ఏ ప్రాంతానికైనా తీసుకెళ్లొచ్చు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *