[spt-posts-ticker]

3 వేల బృందాలతో ఇంటింటి సర్వే

  • 221 కంటైన్మెంట్‌ సెంటర్లలో పరీక్షలు
  • కరోనా కట్టడిపై మరింత అప్రమత్తం
  • ముందస్తుగా మందులు, మెడికల్‌ కిట్లు సిద్ధం

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తూనే.. వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపడుతున్నది. వైద్యారోగ్యశాఖ పరిధిలో ఏర్పాటుచేసిన 3 వేల ప్రత్యేక బృందాలు 221 కంటైన్మెంట్‌ క్లస్టర్ల పరిధిలోని 3,01,002 గృహాలకు వెళ్లి 12,04,008 మందిని కలిసి వారి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నాయి. వ్యాధి లక్షణాలు ఆలస్యంగా బయటపడుతుండటంతో వైరస్‌ ఇతరులకు సోకకుండా పాజిటివ్‌ వచ్చినవారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్‌ అయిన వ్యక్తులను గుర్తించి వారికి కూడా వైద్యనిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగుతున్న పాజిటివ్‌ కేసులకు అవసరమైన మందులు అధికసంఖ్యలో అందుబాటులో ఉంచింది. రూ.400 కోట్లతో కొనుగోలుచేసి ముందస్తుగా సిద్ధం చేసింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి, కరోనా రోగులకు అవసరమైన కిట్లు, మాస్క్‌లు, టెస్టింగ్‌ కిట్లను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలుచేసింది.

ప్రత్యేక యాప్‌ద్వారా

రాష్ట్రంలో కొవిడ్‌-19 వైరస్‌ సోకి చికిత్స తీసుకుంటున్న రోగులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రోగులు కొంతమంది కరోనావార్డులో సరిగా ఉండకపోవడం, మరికొందరు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండటంతో వాటికి చెక్‌పెట్టేందుకు కొవిడ్‌ మానిటరింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కరోనా రోగుల్లో 90శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్టు గుర్తించి.. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సాయంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేసి వాటిల్లో ఇన్‌స్టాల్‌ చేశారు. దీనిద్వారా వారి ప్రతికదలికనూ తెలుసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. మర్కజ్‌ యాత్రికులతోపాటు, వారితో కాంటాక్టయి ఇండ్లవద్ద క్వారంటైన్‌లో ఉన్న రెండు వేలమందికి కూడా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *