ఈ ఏడాది కొత్తగా 10,651 మందికి..
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఈ ఏడాది రాష్ట్రంలో హెచ్ఐవీ కేసులు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణలో ఏటా బాధితులు 11 వేల నుంచి 13 వేల మధ్య ఉంటుండగా, 2019-20లో ఆ సంఖ్య 10,651కి పరిమితమైంది. ఈ వ్యవధిలో 33 జిల్లాల్లో 7,78,020 మందికి పరీక్షలు నిర్వహించారు. హెచ్ఐవీ వ్యాప్తి రేటు మహబూబ్నగర్ జిల్లా (2.75)లో అధికంగా ఉంది. ఉమ్మడి జిల్లాలపరంగా చూసినా ఇక్కడే అత్యధికం. రెండో స్థానంలో వికారాబాద్ (2.69), ఆ తర్వాత సంగారెడ్డి, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లాలు ఉన్నాయి.కేసుల విషయానికొస్తే హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. రాజధానిలో 1,944 హెచ్ఐవీ కేసులు నమోదవగా రెండో స్థానంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఉంది. 2018లో హెచ్ఐవీ వ్యాప్తిలో మిజోరం, తెలంగాణ ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ ఏడాది రాష్ట్రంలో 11,820 కేసులు నమోదయ్యాయి. 2019లో 1,169 మేర తగ్గాయి. గతంలో హెచ్ఐవీ వ్యాప్తి కేసుల్లో తెలంగాణనాలుగో స్థానంలో నిలవగా 2019లో 6వ స్థానానికి మారింది. రెండేళ్లలో ఇన్ఫెక్షన్ రేటుతో పాటు మరణాలూతగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 80,645 మంది హెచ్ఐవీకి చికిత్స తీసుకుంటున్నారు.హెచ్ఐవీకి చికిత్స లేదు..నివా రణ ఒక్కటే మార్గం. అప్రమత్తంగా ఉండడం వల్ల వ్యాధిని నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. హెచ్ఐవీపై అవగాహన కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వ్యాధిపై అవగాహన పెంచుతూ సురక్షితం కాని లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు తెలియజేస్తున్నారు. అయితే హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్షత చూపరాదని చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు..
వ్యాధిగ్రస్తులకు నాలుగు దశల్లో లక్షణాలు కనిపిస్తాయి. మొదటి దశలో ఫ్లూ జ్వరం, రక్తంలో వైరస్ సంఖ్య అధికంగా ఉన్నట్లయితే ప్రతిరక్షకాలు కనిపించవు. టీబీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. రెండో దశలో హెచ్ఐవీ ఉనికి తెలుస్తున్నది. మూ డో దశలో వ్యాధి నిరోధక శక్తి క్రమంగా తగ్గుతున్నది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. నాల్గో దశలో దీర్ఘకాలిక జ్వరం, నీళ్ల విరేచనాలు, నోటిలో పుళ్లు ఏర్పడడం, లింఫు గ్రంథులు వాయడం, శరీరం బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఉమ్మడి కొత్త జిల్లాలు కేసులు
ఆదిలాబాద్ 440,హైదరాబాద్ 1944, కరీంనగర్ 713, ఖమ్మం 988,మహబూబ్నగర్ 1407,మెదక్ 1097,నల్లగొండ 1180
నిజామాబాద్ 808,రంగారెడ్డి 1312,వరంగల్ 762 నమోదు అయినాయి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]