[spt-posts-ticker]

31 వరకు దంత పరీక్షలు బంద్‌ తెలంగాణ డెంటిస్ట్‌ అసోసియేషన్‌ ప్రకటన

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 31 వరకు అన్ని రకాల దంత పరీక్షలు నిలిపివేయాలని తెలంగాణ దంత వైద్యుల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దంత పరీక్షల సందర్భంగా ఒకరి నుంచి ఒకరికి వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో దంత వైద్యులంతా ప్రాక్టీసుకు దూరంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా కరోనా తాకిడి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, పరీక్షలకు దూరం పెట్టాలని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ప్రియాంక మర్తినేని కోరారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *