హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 471 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో 388 మంది మర్కజ్ వెళ్లొచ్చినవారే అని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ 665 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 18 పాజిటివ్ వచ్చాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 12 మంది మృతి చెందారని ఈటల పేర్కొన్నారు. 45 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని, 414 మందికి చికిత్స కొనసాగుతోందని చెప్పారు. రాత్రికి మరికొన్ని టెస్టులు రావాల్సి ఉందని, శుక్రవారం 70 మంది వరకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేవలం ఒక్కరికే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఈ నెల 22 నాటికి అందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. మర్కజ్ ఘటన లేకుంటే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రం అయ్యేదని ఈటల వెల్లడించారు. గతంలోలా వేల సంఖ్యలో శాంపిల్స్ వచ్చే అవకాశం లేదని ఈటల తెలిపారు.
388 కరోనా కేసులు మర్కజ్ వెళ్లొచ్చినవారే: మంత్రి ఈటల
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]