[spt-posts-ticker]

చికిత్సలపై పరిశోధనలకు ప్రపంచస్థాయి కేంద్రం

 

హైదరాబాద్‌ : వైద్యం తీరుతెన్నులు మారిపోతున్న ఈ ఆధునిక కాలానికి తగ్గ చికిత్స విధానాలపై పరిశోధనలు చేసే ఓ అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. కణ, జన్యుస్థాయి చికిత్సలపై పరిశోధనలు చేపట్టే ఈ సంస్థను నిర్మించడంలో ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సహాయం తీసుకోనున్నట్లు సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన బయోఆసియా సదస్సులో తెలిపారు. ఈ సంస్థ భారతీయులకు, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే పరిమితమైన వ్యాధుల చికిత్సకు ప్రాధాన్యమిస్తుందని, కణ, జన్యుస్థాయి చికిత్సలను వీలైనంత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోందని వెల్లడించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *